ఏపీలో మద్యం, ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టవేస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.
సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం ఒక్కరోజే 851 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 41 మంది నిందితులను అరెస్టు చేసి , 65 వాహనాలను స్వాధీన పరుచుకున్నామని వెల్లడించారు.