జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా నెగెటివ్‌

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు మరోసారి కరోనా నెగెటివ్‌ వచ్చింది. మేయర్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌కు ఈ నెల 11న కరోనా పాటిజివ్‌ వచ్చింది. దీంతో వైద్యులు మేయర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు కరోనా లేదని నిర్ధారణ అయ్యింది. గతంలోనూ ఒకసారి చేసిన పరీక్షల్లో మేయర్‌కు నెగెటివ్‌ వచ్చింది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు నెగెటివ్‌ వచ్చింది. కాగా, మేయర్‌ స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.

రెండు వారాల క్రితం నగరంలోని రోడ్డు పక్కనే ఉండే ఓ హోటల్‌లో అధికారులతో కలిసి మేయర్‌ చాయ్‌ తాగారు. ఆ హోటల్‌లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా వచ్చింది. దీంతో వారం క్రితం ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో కరోనా లేదని నిర్ధారణ అయ్యింది.