తెలంగాణలో కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా మరో 237 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 4,974కు చేరింది. కరోనా ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 185 మంది చనిపోయారు.

కొత్తగా వచ్చిన కేసుల్లో 195 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన వాటిలో మేడ్చల్‌ 10, రంగారెడ్డి 8, సంగారెడ్డి 5, మంచిర్యాల 3, వరంగల్‌ అర్బన్‌, కామారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండేసి చోప్పున, మెదక్‌, సిరిసిల్లా, అదిలాబాద్‌, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,412 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.