విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీపీగా పనిచేసిన ద్వారకా తిరుమల రావును బదిలీ చేయడంతో అదనపు సీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులుకు పూర్తిస్థాయి సీపీగా ఉద్యోగోన్నతి కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా నూతన సీపీ మాట్లాడుతూ…నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠన చర్యలు తీసుకొంటాం.. న్యాయం కోసం వచ్చే వారికి అండగా ఉంటాం..ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేస్తామని ఆయన పేర్కొన్నారు. స్ఫెషల్ బ్రాంచ్‌ను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. తనకు మరోసారి సీపీగా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.