సూర్యాపేట జిల్లాలోని అటవీ భూములను గుర్తించి వాటికి సరిహద్దులను గుర్తించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సోమవారం హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి అటవీ భూముల పరిరక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు జిల్లాలోని అటవీ విస్తీర్ణం హద్దులను గుర్తించి వాటికి కంచె, హద్దురాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని అటవీ శాతం చాలా తక్కువగా ఉన్నందున హరితహారంలో జిల్లా అధికారులకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. భూమి మీద హక్కులు, పట్టాలు లేకుండా అక్రమించి ఉన్నారో అలాంటి వారిని గుర్తించి అక్రమాలను తొలగించాలన్నారు. జిల్లాలో 25 వేల ఎకరాల అటవీ భూములు అక్రమణకు గురి అయ్యాయని సింహభాగం హుజూర్‌నగర్ నియోజక వర్గంలోనే ఉన్నాయని తెలిపారు. జిల్లా అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్ యాక్షన్‌గా ఏర్ప డి సర్వే చేపట్టాలని సూ చించారు. అనంతరం మండలాల వారీగా అటవీ భూమలుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ ముకుందారెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓలు లక్ష్మీపతిరావు, శ్రవణ్‌కుమార్, తాసిల్దార్లు పాల్గొన్నారు.