భారత్‌-చైనా మధ్య ఘర్షణ.. సూర్యాపేట జిల్లా కల్నల్‌ మృతి

ల‌డ‌ఖ్‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన గొడ‌వ‌లో భార‌తీయ క‌ల్న‌ల్ ఒక‌రు మృతిచెందారు. వీర‌మ‌ర‌ణం పొందిన ఆయ‌న‌ది తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా. రెండు దేశాలకు చెందిన సైనికుల ఘ‌ర్ష‌ణ‌లో.. భార‌త సైన్యంలోని ముగ్గురు జ‌వాన్లు చ‌నిపోయారు. దీంతో గాల్వ‌న్ వ్యాలీలో ఉద్రిక్త ప‌రిస్థితులు మ‌రింత జ‌ఠిలం అయ్యాయి. బుల్లెట్ ఫైరింగ్ లేకుండా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లోనే ఇరు దేశాల‌కు చెందిన సైనికులు మృత్యువాత‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సూర్యాపేట‌కు చెందిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబు ఆ ఘ‌ర్ష‌ణ‌ల్లో చ‌నిపోయిన‌ట్లు అధికారులు తెలిపారు.  క‌ల్న‌ల్ సురేష్‌.. ల‌డ‌ఖ్‌లోని ఇన్‌ఫాంట్రీ ద‌ళానికి క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. 

సోమ‌వారం రాత్రి గాల్వ‌న్ లోయ‌లో రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. అయితే ఈ ఘ‌ట‌న ఎంతో క‌లిచివేసింద‌ని మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ ట్వీట్ చేశారు.  చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మాజీ సైనికాధికారులు ఆరోపిస్తున్నారు.  చైనా మాత్రం భార‌త వైఖ‌రిని ఖండిస్తున్న‌ది.  భార‌త బ‌ల‌గాలు త‌మ స‌రిహ‌ద్దు దాటి వ‌చ్చిన‌ట్లు ఆ దేశం పేర్కొన్న‌ది. 1975 త‌ర్వాత తొలిసారి రెండు దేశాల మ‌ధ్య వివాదం హింసాత్మ‌కంగా మారింది.