జూన్ 20 నుంచి మొదలయ్యే హరితహారాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్‌ఎండీఏ నర్సరీని ఆయన సందర్శించారు. నర్సరీలో ప్రస్తుతం సిద్ధంగా ఉన్న మొక్కల వివరాలను మున్సిపల్ కమిషనర్ వెంకటమణికరణ్, నర్సరీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో లక్ష మొక్కలను నాటే విధంగా ఆయా మున్సిపాలిటీలకు టార్గెట్‌లను ఇచ్చారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 14,500 మొక్కలు నాటాలని చెప్పారు. హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ లలితాసోమిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.