ఏపీలో కొత్తగా 351 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ రోజురోజుకూ పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు.

వీటిలో 275 కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా 76 ఇతర ప్రాంతాలకు చెందిన వారివని రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 7071మంది వైరస్‌ బారిన పడగా 90 మంది మరణించారని తెలిపారు.  వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని  అధికారులు కోరారు.