ఇండో, చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు జనం భారీగా జనం తరలి వస్తున్నారు. స్వీయ క్రమశిక్షణతో భౌతిక దూరం పాటిస్తూ దారిపొడవునా సంతోష్ భౌతికకాయంపై పూలు చల్లుతూ వీరుడా నీకు జోహర్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయా జెండాలు చేబూని మీ త్యాగం వృథా కాదు..ముష్కరులకు బుద్ధి చెబుతాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో సంతోష్ బాబు అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు 50 మందికి అనుమతించారు. కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.