ఏపీలో కొత్తగా 425 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గురువారం కొత్తగా 425 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13,923 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా 299 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసుల్లో విదేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారే 126 మంది ఉన్నారు. విదేశాలు, పొరుగు రాష్ట్రాలు, ఏపీకి చెందినవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,496కు చేరింది.  

గడచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతిచెందారు. రాష్ట్రంలో  నమోదైన మొత్తం 5,854 పాజిటివ్ కేసులకు గాను 2,983 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ 92 మంది మరణించారు. ప్రస్తుతం  2,779 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.