సీపీ మహేశ్‌ భగవత్‌కు అదనపు డీజీపీగా పదోన్నతి

రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ గురువారం అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఆయన ఐజీ హోదాలో కొత్తగా ఏర్పాటైన రాచకొండ సీపీగా నాలుగేండ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా, హైదరాబాద్‌, నల్లగొండ తదితర జిల్లాల్లో డీసీపీ, ఎస్పీగా పనిచేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా నకిలీ విత్తనాల తయారీదారులపై పీడీ యాక్ట్‌ను విధించారు. ఆయన సేవలను అభినందిస్తూ అమెరికా ప్రభుత్వం హీరో అవార్డును అందించింది. అదనపు డీజీపీగా పదోన్నతి పొందిన మహేశ్‌ భగవత్‌ను రాచకొండ పోలీసు కమిషనర్‌గా కొనసాగేలా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.