తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్యను మరింత పెంచాలని టీటీడీ ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇప్పటివరకు 7వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉండగా అదనంగా మరో 3వేల మంది భక్తులకు శుక్రవారం నుంచి దర్శనం కల్పిస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా దాదాపు 80 రోజుల పాటు ఆలయాన్ని మూసివేసిన అధికారులు లాక్‌డౌన్ సడలింపులతో వారం రోజుల క్రితం ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఈనెల 30వరకు ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.