తెలంగాణలో కరోనా మహ మ్మారి మరింతగా విజృంభిస్తోంది. గురువా రం ఒక్కరోజే ఏకంగా 352 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6 వేలు దాటింది. గురువారం నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 302 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ జిల్లాలో 10, మంచిర్యాలలో 4, జనగామ, వరంగల్ అర్బన్‌లో 3, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. కరోనాతో మరో ముగు ్గరు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఈ వైరస్ తో మృతిచెందిన వారి సంఖ్య 195కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,027 కేసులు నమోదు కాగా.. 3,031 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 2,531 మంది వివిధ ఆస్పత్రులు, హోంఐసోలేషన్‌లో ఉన్నారు.