ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలీంగ్‌లో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు పోటి పడుతున్నారు.
వీరిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు ఉన్నారు. సరైన సంఖ్యా బలంలేకున్నా టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు.