ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. టెన్త్ విద్యార్థులందర్నీ పాస్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు రిఫండ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయ్యారు.
