ఏపీలో కొత్తగా 491 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ఏపీలో శనివారం కొత్తగా  రికార్డుస్థాయిలో 491 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా గడిచిన 24 గంటల్లో  ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. కృష్ణా, కర్నూలు జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు జిల్లాలో ఒకరు మృతిచెందారు. కోవిడ్‌-19 కారణంగా ఏపీలో ఇప్పటివరకు 101 మంది చనిపోయారు. 

విదేశాల నుంచి వచ్చిన 18 మంది, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 89 మందితో పాటు రాష్ర్టానికి చెందిన 390 మందికి తాజాగా ఈ వైరస్‌ సోకింది. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,452కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,240. వ్యాధి నుంచి కోలుకుని 411 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.