ప్రతి ఒక్కరూ పురాతన యోగాను జీవతంలో ఒక భాగం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. యోగాతో శారీరకంగా, మానసికంగా ప్రశాంతత లభిస్తుందని అన్నారు.
ప్రధాని మోదీ భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి, మంత్రులు ఆమోద యోగ్యమైన, విశ్వసనీయమైన సమాధానాలు చెప్పారని అన్నారు. అయితే కొందరు ఆరోపణలు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘ఒకరి పట్ల మరొకరు వేలెత్తి చూపించుకోవడమో లేక తప్పులను ఎత్తి చూపించుకోవడమో చేసుకునే సమయం కాద’ని ఆయన పేర్కొన్నారు. ‘ భారత దేశ ఐక్యతను, సైన్యానికి మద్దతు చాటాల్సిన సమయమ’ని ట్విటర్‌లో పేర్కొన్నారు.