భారత్‌లో 24 గంటల్లో 14,821 కొత్త కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ కోవిడ్‌–19 కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక్కరోజులోనే 15వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాటిజివ్‌ కేసుల సంఖ్య 4 లక్షల 25వేల మార్క్‌ను దాటింది. ఇప్పటివరకూ భారత్‌లో 4,25,282 కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 14,821 కొత్త కేసులు నమోదు కాగా, 445మంది మృతి చెందారు. ఇక యాక్టివ్‌ కేసులు 1,74,387 ఉండగా, 2,37,196మంది మహమ్మారి నుంచి కోరుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ వైరస్‌ బారినపడి 13,699మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. ​కాగా భారత్‌లో మరో పది రోజుల్లోనే రెండు లక్షల కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటేస్తుందని అమెరికాకు చెందిన మిషిగాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అంచనా వేశారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా గడగడలాడిస్తోంది.