ఏపీలో కొత్తగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం కొత్తగా 443 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,704నమూనాలు పరీక్షించగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 44 మందికి, విదేశాల నుంచి వచ్చిన 7 మందికి కరోనా సోకినట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో 83 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4435కు చేరుకుంది. కరోనాతో ఇవాళ ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 111కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4826 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.