ఏసీబీకి చిక్కిన పాల్వంచ మండలం కిన్నెరసాని వీఆర్వో పద్మ

లంచం తీసుకుంటూ ఓ వీఆర్వో ఏసీబీకి చిక్కింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకుంది. కిన్నెరసాని వీఆర్వో పద్మ అవినీతికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడింది. కల్యాణలక్ష్మి దరఖాస్తుదారు నుంచి లంచం డిమాండ్‌ చేసింది. పాల్వంచ తహసీల్దార్‌ కార్యాలయంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది.