రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలు రంగాల ప్రముఖులు, తదితరులు హాజరయ్యారు.