ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక చేయూతను కల్పించేందుకు వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని బుధవారం ప్రారంభించారు. అమరావతిలోని తాడిపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు.
కాపు వర్గంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఒక్కొక్కరికీ రూ.15వేల చొప్పున జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 2,37, 873 మందికి సుమారు రూ.400 కోట్ల ఆర్థిక చేయూతను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలుగా ఎలాంటి రాగద్వేషాలకు, రాజకీయ వివక్షకు తావు లేకుండా అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.