తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే 11,493 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. 2903మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు.
శ్రీవారిని దర్శించుకునేందుకు 10వేల మంది భక్తులకు మాత్రమే అవకాశము ఉండగా ఈ సంఖ్యను 13వేలకు పెంచుతూ గురువారం నుంచి అమలు చేస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం సర్వదర్శనానికి టోకెన్లు జారీ చేస్తున్నామని వారు తెలిపారు. రూ.10వేల విరాళాలు సమర్పించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని అన్నారు. కోవిడ్ నిబంధనలు ఆలయంలో పక్కాగా అమలు చేస్తున్నామని వివరించారు.