ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం నియంత్ర చర్చలు చేపట్టినా కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 22,305 శాంపిల్స్‌ను పరీక్షించగా 570 మందికి కొవిడ్-19 పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11498కి చేరింది. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. మొత్తం మరణాల సంఖ్య 146కు చేరింది.
జిల్లాల వారీగా యాక్టీవ్ కేసుల సంఖ్య చిత్తూరు 429, ప్రకాశం 111, అనంతనపురం 764, కడప 388, కర్నూలు 694, నెల్లూరు 227, గుంటూరు 477, కృష్ణ 626, పశ్చిమ గోదావరి 643, తూర్పు గోదావరి 519, విశాఖపట్నం 201, విజయనగరం 83, శ్రీకాకుశం 24గా ఉంది. వేదేశాల నుంచి వచ్చిన వారు 289 మంది కాగా… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 672 మంది ఉన్నారు.