- చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
ఫార్మా కంపెనీ దివిస్ యాజమాన్యం తమ కంపెనీకి అవసరమైన విద్యుత్ కోసం 132 కెవి హై టెన్షన్ స్తంభాలను తమ పొలంలో నుంచి తీసుకెళ్తున్నరంటు రైతుల ఆందోళన..
కొద్దిరోజులుగా వ్యవసాయ పొలంలోనే టెంట్ వేసుకుని ఆందోళన చేస్తున్న రైతులు..
132 కెవి హైటెన్షన్ వైర్లు తమ పొలాల్లో నుంచి వెళ్తే తమకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు..
దివీస్ కంపెనీ వల్ల ఇప్పటికే తమ భూములు పాడైపోయాయిని, గ్రౌండ్ వాటర్ పూర్తిగా కలుషితం అయిందని రైతులు వాపోతున్నారు..
దివీస్ కంపెనీ వల్ల చౌటుప్పల్ మండలంలోని అనేక గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసిన రైతులు.
ఇప్పుడు తమకు ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా పొలాల్లో నుండి 132 కెవి హైటెన్షన్ స్తంభాలను వేస్తున్నారని ఆందోళనకు దిగిన రైతులు..
తంగడపల్లి గ్రామంలో భారీగా మోహరించిన రాచకొండ పోలీసు బలగాలు.
తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్న తంగడపల్లి గ్రామపంచాయతీ రైతులు.
రోడ్డు వెంబడి స్తంభాలు తీసుకపోతే అధిక ఖర్చు వస్తుందని తమ పొలాల మధ్యలో నుండి దివీస్ కంపెనీ యాజమాన్యం అక్రమంగా విద్యుత్ వైర్లను తీసుకెళ్తుందని రైతులు ఆందోళన చేసారు.