గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సింగర్ సాకేత్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దెతడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన ప్రముఖ సింగర్ సాకేత్.

ఈ సందర్భంగా సాకేత్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు రెండు రకాల పనులు చాలా ఇష్టం వుంటే చేయడం చెట్లను పెంచండి అందులో నేను ఒక భాగంగా నాకు ఇష్టమైన మొక్కలు నాటడం లాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా మరో ముగ్గురు ప్లే బ్యాక్ సింగర్స్ దినకర్, పర్ణిక, యాక్టర్ & సింగర్ కౌముది లను మొక్కలు నాటాలని కోరారు.