గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన పటాస్ బలవిందర్ సింగ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చిలుకనగర్ కార్పొరేటర్ గోపు సరస్వతి సదానందం ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఉప్పల్ లో మొక్కలు నాటిన పటాస్ షో ఫేమ్ బలవిందర్ సింగ్.
ఈ సందర్భంగా బలవిందర్ సింగ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ఒక మంచి కార్యక్రమం అని అందులో నేను కూడ పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఇలాంటి కార్యక్రమంలో తనననీ భాగస్వామ్యం చేసినందుకు గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బలవిందర్ సింగ్ మరో ముగ్గురికి ఛాలెంజ్ చేశారు. పటాస్ షోలో పాల్గొంటున్న శరత్, ఫైమ మరియు ప్రవీణ్ లను మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గోపు సరస్వతి సదానందం పాల్గొన్నారు.