గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ప్రముఖ దర్శకులు v.v. వినాయక్, నాయిక పూనమ్ కౌర్.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా “మనం సైతం” కార్యాలయంలో నటుడు కాదంబరి కిరణ్ తో కలిసి మొక్కలు నాటిన దర్శకులు v.v. వినాయక్, నాయిక పూనమ్ కౌర్.
ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. భావి తరాలకు మనం ఇచ్చే విలువైన బహుమతి లాంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.