నేటి నుంచి వర్చువల్‌ నేచర్‌ క్యాంప్‌

విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన
ఫారెస్ట్‌, యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సంయుక్తంగా నిర్వహణ
తెలంగాణ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ సంయుక్తంగా పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టాయి. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల పాటు వర్చువల్‌ నేచర్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈనెల 29 నుంచి జూలై 4 వరకు.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 4.45 వరకు ఆన్‌లైన్‌ సెషన్స్‌ జరుగుతాయి. అటవీ శాఖ ఉన్నతాధికారులు పర్యావరణానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడుతారు. ఆరో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు ఇందులో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతిరోజు విద్యార్థులకు ఒక టాస్క్‌ అసైన్‌ చేస్తారు. వారి ఇంటి చుట్టు పక్కల ఉన్న మొక్కలు, చెట్లను పరిశీలించి వాటి పేర్లు రాసి.. మెయిల్‌ చేసి టాస్క్‌ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్‌ బహూకరించనున్నారు. సోమవారం నేటివ్‌ ట్రీ ఐడెంటిఫికేషన్‌, మంగళవారం బటర్‌ఫ్లైస్‌ ఇన్‌ యువర్‌ గార్డెన్‌, బుధవారం సీడ్‌ కలెక్షన్‌, గురువారం బర్డ్‌ వాచింగ్‌, శుక్రవారం నేచర్‌ డాక్యుమెంట్‌ మూవీ, శనివారం ఎన్విరాన్‌మెంట్‌ ప్రాముఖ్యత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. 9315237005 కు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.