తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన..

తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి కేంద్ర బృందం చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అధ్వర్యంలో సెంట్రల్ టీమ్ టిమ్స్ ఆస్పత్రిని పరిశీలిస్తుంది. అనంతరం ఉదయం 11.30 గంటలకు దోమలగూడ కంటైన్మెంట్ దోబీగల్లీలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఆ తర్వాత హిమాయత్ నగర్‌లోని వినయ్ బాబు ఇంటికి కేంద్ర బృందం వెళ్లనుంది. ఇక, మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌కే భవనంలో లంచ్ అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారి, వైద్య అధికారులు కరోనా కట్టడి, పీపీఈ కిట్లపై కేంద్ర బృందానికి వివరణ ఇవ్వనున్నారు.