ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఐదువందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించగా, 793 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,891కి చేరగా, మృతుల సంఖ్య 180కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 7479 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 6232 మంది కోలుకున్నారు.
ఈ రోజు మరణించినవారిలో కర్నూలు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కరి చొప్పున ఉన్నారు. రాష్ట్రంలో నిన్న 30126 నమూనాలు పరీక్షించగా, 793 పాజిటివ్‌లుగా తేలిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.