మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌రావు హత్య

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్, స్థానిక వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌రావుపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంఘటన స్థానిక మున్సిపల్‌ చేపల మార్కెట్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం స్థానిక మున్సిపల్ చేపల మార్కెట్ వద్ద ఉన్న మోకా భాస్కరావును గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌రావును స్థానికులు దవాఖానకు తరలించారు. కాగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.