గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ గాయని సోనీ కొండూరి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గాయనీ పర్ణిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జర్నలిస్ట్ కాలనీ లోని పార్క్ లో మొక్కలు నాటిన యువ గాయని సోనీ కోడూరి.

ఈ సందర్భంగా సోనీ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పదని. నీను మా ఇంట్లో మొక్కలు పెంచుతు ఉంటాను అని భవిష్యత్ తరాలకు మనం ఏదైనా ఇవ్వాలి అంటే అది మంచి వాతావరణంమే కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనం పెంచడం కోసం కృషి చేయాలని ఇది మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేను మరొక ముగ్గురికి ఆట సందీప్, గాయకులు హరీక, పృథ్వి చంద్రలను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.