ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ గా పని చేస్తున్న రఘునాధ్ రూ. 25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆరోగ్య శ్రీ లో ఓ డెంటల్ హాస్పిటల్ రెన్యూవల్ కోసం రూ. 30 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా, ఒప్పందంలో భాగంగా ముందస్తుగా రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. రఘునాధ్ కార్యాలయంతో పాటు ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా కో ఆర్డినేటర్ గా కూడా రఘునాధ్ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.