ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో క‌రోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలోనే ఏపీ అత్యున్నత న్యాయ‌స్థానం కీల‌క‌ నిర్ణ‌యం తీసుకున్నది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ బుధ‌వారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసులు మాత్ర‌మే విచార‌ణకు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపింది. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే  కేసుల విచార‌ణ జ‌రప‌నున్న‌ట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో న్యాయమూర్తులు అధికారిక నివాసాల నుంచే వీడియో కాన్ఫ‌రెన్స్‌లో విధులునిర్వహించవచ్చు . ఇక పిటిష‌న్లు సైతం ఈ-ఫైలింగ్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే న‌మోదు చేయాల‌ని ఆదేశించింది.