దేశంలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తున్నది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్ని రాష్ర్టాల్లో వైరస్ విజృంభిస్తున్నది. దీంతో కరోనా బారినపడుతున్న వారిసంఖ్య ప్రతిరోజు వేలల్లో ఉంటుంన్నది. దేశంలో గత పది రోజులుగా ప్రతిరోజు 15 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 20,903 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా వైరస్ వల్ల ఈ రోజు ఉదయం వరకు 379 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,25,544కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 2,27,439 కేసులు యాక్టివ్గా ఉండగా, మరో 3,79,892 మంది కోలుకున్నారు. ప్రాణాంతక మహమ్మారి వల్ల ఇప్పటివరకు 18,213 మంది మృతిచెందారు.
దేశవ్యాప్తంగా గురువారం 2,41,576 మంది పరీక్షలు చేశామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. జూలై 2 వరకు మొత్తం 92,97,749 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
అత్యధిక కేసులు నమోదైన రాష్ర్టాలు
మహారాష్ట్ర- 1,86,626 కేసులు, 8178 మంది మృతి
తమిళనాడు- 98,392 కేసులు, 1321 మంది మృతి
ఢిల్లీ- 92,175 కేసులు, 2864 మంది మృతి
గుజరాత్- 33,913 కేసులు, 1886 మంది మృతి
ఉత్తరప్రదేశ్- 24,825 కేసులు, 735 మంది మృతి
పశ్చిమబెంగాల్- 19,819 కేసులు, 699 మంది మృతి
రాజస్థాన్- 18,662 కేసులు, 430 మంది మృతి
తెలంగాణ- 18,570 కేసులు, 275 మంది మృతి
కర్ణాటక- 18,016 కేసులు, 272 మంది మృతి
ఆంధ్రప్రదేశ్- 16,097 కేసులు, 198 మంది మృతి