ఏపీలో కొత్తగా 837 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 837 పాజిటివ్‌ కేసులు నమోదవగా, తొమ్మిదిమంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,934కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 206 మంది మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 7632 మంది బాధితులు కోలుకోగా, 9,096 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 38,898 కరోనా టెస్టులు చేయగా, 837 మంది కరోనా బాధితులుగా తేలారు. ఇందులో ఇద్దరు విదేశాల నుంచి వచ్చినవారు ఉండగా, 46 మంది వేరే రాష్ర్టాల నుంచి వచ్చినవారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 9,71,611 కరోనా టెస్టులు నిర్వహించారు.