హరితహారం పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై వేటు పడిన ఘటన జిల్లాలోని దేవురుప్పుల మండలంలో చోటు చేసుకుంది. మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్ హరితహారం విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో కలెక్టర్ నిఖిల సస్పెండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం పనుల్లో నిర్లక్ష్యానికి తావు లేదని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఎవరైనా విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.