ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలను జనసేన అధినేత, సినీహీరో పవన్‌కల్యాణ్ ట్విట్టర్లో అభినందించారు. విజయవాడలో సీఎం జగన్ 1088 అధునాతన అంబులెన్స్‌లను ప్రారంభించి వాటిని రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. అత్యవసర సేవల్ని అందించే అంబులెన్స్‌లను ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ ప్రారంభించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనూ ఆయన ప్రశంసించారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నతీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మూడునెలలుగా ఏ మాత్రం అలసత్వం వహించకుండా వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించడం అభినందినీయమని పేర్కొన్నారు.