పంచాయతీకి పన్ను బకాయి ఫలితం
ఆస్తి పన్ను చెల్లించని కారణంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సమీపంలోని ఆర్చ్ ఫార్మా కంపెనీ ఆస్తులను పంచాయతీ పాలకవర్గ సభ్యులు శుక్రవారం జప్తు చేశారు. సదరు కంపెనీ మిట్టపల్లి పంచాయతీకి రూ.60 లక్షల పన్ను బకాయి పడింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో శుక్రవారం మండల అధికారితో కలిసి ఫ్యాక్టరీకి చెందిన సుమారు రూ.5 లక్షల విలువ కలిగిన కంప్యూటర్లు, ప్రింటర్, కుర్చీలు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.