మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు

హరితహారం మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు
నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంతో పాటు మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత చేపట్టాలని జిల్లా అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు అన్నారు.
మంగళవారం హరితహారం, మరియు రాజ్యసభ ఎంపీ జె. సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన అదనపు ఎస్పీ జిల్లా అర్ముడ్ రిజర్వు (AR) ప్రధాన కార్యాలయంలో మొక్కలు నాటి, MLA G.రమణారెడ్డి, OSD P. శోభన్ కుమార్, మరియు జిల్లా అటవీ శాఖ అధికారి పురుషోత్తంకు గ్రీన్ చాలెంజ్ విసిరారు.
ఈ సందర్భంగా వి . శ్రీనివాసులు గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, వాతవరణ సమతుల్యత అనేవి మొక్కల పెంపకం ద్వారానే సాధ్యమని అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, వాటిని, సంరక్షించాలన్నారు. ప్రాణధారమైన మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా సకాలంలో ఋతుపవనాలు రావడమే కాకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. హరితహారంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావడం ద్వారా భావితరాలకు కలుష్యరహితమైన వాతావరణం అందించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, RSI రాజు, నయీం, మరియు కమ్యూనికేషన్ ఎస్.ఐ. SI సతీష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.