జీవీకే గ్రూప్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్), మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ముంబై ఎయిర్పోర్టు కార్యకలాపాల్లో రూ.705 కోట్ల అవకతవకల ఆరోపణలపై ఈ కేసు దాఖలైనట్లు మంగళవారం అధికారులు తెలిపారు. సీబీఐ ఇటీవల నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసును పెట్టింది. మరోవైపు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులను తాము అందుకోలేదని జీవీకే ప్రతినిధి చెప్తున్నారు.
