తెలంగాణలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1,924 మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 1,924 కరోనా కేసులు వెలుగుచూశాయి. జీహెచ్‌ఎంసీలో 1,590 మంది పాజిటివ్‌గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రంగారెడ్డి 99, మేడ్చల్‌ మల్కాజిగిరి 43, వరంగల్‌ రూరల్‌ 26, సంగారెడ్డి 20, నిజామాబాద్‌ 19, మహబూబ్‌నగర్‌ 15, కరీంనగర్‌ 14, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల 13 చొప్పున, వికారాబాద్‌ 11, వనపర్తి 9, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌ 7 చొప్పున, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మెదక్‌ 5 చొప్పున, ఖమ్మం 4, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌,  జగిత్యాల, కామారెడ్డి 3 చొప్పున, నారాయణపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. 992 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల  11 మంది మృతిచెందారు. బుధవారం 6,363 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,34,801కు చేరింది. కాగా, ఉస్మా నియా దవాఖాన సూప రింటెండెంట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.