ఉద్యోగ నియమాకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయంలో రెండోరోజూ గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు పలు రికార్డ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ నియామకాల్లో లంచాలు తీసుకున్నారన్న అభియాగాలపై డీఎంహెచ్‌వో డాక్టర్ అనిల్‌కుమార్‌ను అధికారులు విచారించారు.
అనంతపురం ఇన్చార్జి డీఎస్పీ అల్లాబకాష్ నేతృత్వంలో మొదటిరోజు అర్ధరాత్రి వరకు కార్యాలయంలోని వివిధ సెక్షన్లకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించేందుకు 55 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి నిర్ణయించింది. అధికారులు 53 పోస్టులను భర్తీ చేశారు. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.