ఏపీలో కొత్తగా 1,555 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 1,555 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 1,500 మందికి కరోనా నిర్ధారణ కాగా,  ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 53 మందితో పాటు విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా సోకింది. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య  23,814కు చేరింది. 

ప్రస్తుతం 11,383 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకొని 12,154 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  ఒక్కరోజే  కరోనా వల్ల మరో 13 మంది చనిపోయారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 277 మంది మరణించారు.