ఏపీలో కొత్తగా 1576 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 1576 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటిన్‌లో వెల్లడించారు. ఇప్పటివరకు  11లక్షల 15వేల 635 కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.

13,194 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జి అయ్యారని వివరించారు. 11936 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అనంతపురంలో 191కేసులు, తూర్పుగోదావరిలో 169, కర్నూలు, పశ్చిమగోదావరిలో 144 చొప్పున, గుంటూరులో 136, ప్రకాశంలో 110 కరోనా కేసులునమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఈ ఒక్కరోజే  అత్యధికంగా 208 కేసులు నమోదు అయ్యాయి.  రాష్ట్రంలో ఇప్పటివరకు 292 మంది కరోనా బారిన పడి మృతిచెందారు.