గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి యాంకర్ సుష్మ కిరణ్, రవికిరణ్

యువ నటి, యాంకర్‌ సుష్మ కిరణ్‌, తన భర్త రవి కిరణ్‌తో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని నేడు మొక్కలు నాటారు. రేడియో జారీ కాజల్‌ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి నగరంలోని నానక్‌రామ్‌గూడలో తన భర్తతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రోజు రోజుకి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందన్నారు. స్వేచ్ఛగా గాలి పీల్చుకునే పరిస్థితులు కూడా లేకుండా పోతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఎంతో మంచి కార్యక్రమమని కొనియాడారు.

ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ వంతు మొక్కలు నాటాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. రవికిరణ్‌, అనూష్‌ రెడ్డి, మధు రెడ్డి, నీరుపమా, కౌషల్‌, కౌశిక్‌ లకు మొక్కలు నాటాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సహ వ్యవస్థాపకుడు రాఘవ, ప్రతినిధి కిషోర్‌ గౌడ్‌, గచ్చిబౌలి కార్పొరేటర్‌ సాయిబాబా పాల్గొన్నారు.