రాష్ట్రంలో శనివారం కొత్తగా 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 736 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ మల్కాజిగిరి 101, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల 24 చొప్పున, వరంగల్‌అర్బన్ 20, మెదక్ 16, సంగారెడ్డి 13, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ 12 చొప్పున, యాదాద్రిభువనగిరి, వికారాబాద్, సిద్దిపేట 9 చొప్పున, ఆదిలాబాద్ 8, సూర్యాపేట 7, జోగుళాంబగద్వాల 6, నారాయణపేట, మంచిర్యాల 5 చొప్పున, ఖమ్మం, వరంగల్‌రూరల్, నిర్మల్, జగిత్యాల, జనగామ, వనపర్తి జిల్లాల్లో 2 చొప్పున, కుమ్రంభీంఆసిఫాబాద్ 1 కేసు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,62,171 పరీక్షలుచేయగా, 33,402 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. మొత్తం 348 మంది మరణించారు.
ఇప్పటివరకు 20,919 మంది డిశ్చార్జికాగా, శనివారం 1,714 మంది కోలుకొని క్షేమంగా ఇంటికివెళ్లారు. రాష్ట్రంలోని కొవిడ్ దవాఖానల్లో చికిత్స నిమిత్తం మొత్తం 17,081 పడకలు సిద్ధంగా ఉండగా, 1,831 పడకలే భర్తీ అయ్యాయని, 15,250 పడకలు ఖాళీగా ఉన్నాయని స్పష్టంచేసింది. కాగా, హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమిషనర్ కార్యాలయంలోని టీఎస్‌బీసీఎల్‌లో కరోనాతో శనివారం ఓ ఉద్యోగి మృతిచెందినట్టు సమాచారం. కరోనా బారిన పడుతున్న రెవెన్యూ ఉద్యోగులను నిమ్స్‌లో చేర్చి మెరుగైన వైద్యం అందించాలని ట్రెసా నాయకులు మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. శనివారం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి గౌతమ్‌కుమార్ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.