తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాల నుంచి వెల్లువడే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంలో కార్బన్‌డైయాక్సైడ్ స్థాయిలను తెలుసుకునేందు సైబర్ టవర్స్ జంక్షన్ వద్ద ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేశారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ చేసి శబ్ద కాలుష్యంతో పాటు, వాయు కాలుష్యాన్ని నివారించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మరి కొద్ది రోజుల్లో రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మరో రెండు బోర్డులను రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.