ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రోజా అప్రమత్తమయ్యారు. అమె కుటుంబ సభ్యులతో కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టు వచ్చే వరకు వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కరోనా బారిన పడిన రోజా గన్‌మెన్‌ తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.